సత్యరాజ్ ‘వెపన్’ ట్రైలర్ చూశారా..?
- MediaFx
- May 31, 2024
- 1 min read
Updated: Jun 1, 2024
సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వెపన్. ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాన్యహోప్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మిలియన్ స్టూడియో బ్యానర్‌పై ఎమ్‌ఎస్ మాన్జూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది సాధారణ మిషన్ కాదు అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ట్రైలర్‌ను చూస్తుంటే ఇందులో సత్యరాజ్ నెగెటివ్ రోల్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఓ క్రూరమైన వ్యక్తిని పట్టుకోవడం కోసం బృందాలను పంపిస్తే వారినే అతడు చంపివేస్తాడు. అతడిని ఎలా పట్టుకున్నారు. అతడు ఎందుకు అలా చేస్తున్నాడు అనే స్టోరీ లైన్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను జూన్ 7 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్రైలర్ ఆఖరిలో చిత్ర బృందం తెలియజేసింది.