బాలీవుడ్ యాంగ్ హీరో విక్కీ కౌషల్ ‘హుసన్ తేరా తోబా తోబా’ అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఏ రీల్ చూసినా ఇదే సాంగ్. ఈ సాంగ్‌లో స్టెప్పులు మరింత ఫేమస్ అయ్యాయి. విక్కీ కౌషల్ చేసిన ఈ స్టెప్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ చేసేందుకు ఎంతో మంది తెగ కష్ట పడుతున్నారు. మొత్తానికి ఎలాగోలా ఈ సాంగ్‌కి స్టెప్పులు వేసి.. ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో అయితే అప్ లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మారు మూల గ్రామానికి చెందని రూపాలి అనే మహిళ పిల్లలతో కలిసి ఎంతో ఈజీగా ‘తోబా తోబా’ అనే పాటకు స్టెప్పులు వేసి ఎంతో ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట జోరుగా దూసుకెళ్తుంది. ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్‌లో55 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. విక్కీ కౌషల్ కూడా ఈ వీడియోపై స్పందించడంలో రూపాలి డ్యాన్స్ మరింత వైరల్‌గా మారింది. ‘తోబా తోడా’ సాంగ్ హుక్ స్టెప్స్ కి పూర్తిగా న్యాయం చేసింది. అది కూడా సారీలో ఈ మహిళ డ్యాన్స్ చేసింది. పక్కన ఉన్న పిల్లలు కూడా రూపాలిలాగే చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ వీడియోకు యంగ్ హీరో విక్కీ కౌషల్.. ‘వావ్’ అని రిప్లై ఇస్తూ కామెంట్ చేశాడు.