top of page
MediaFx

టెలిగ్రామ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి అలెర్ట్..


పరిశోధకులు టెలీగ్రామ్ 10.14.4 లేదా అంతకంటే పాత వెర్షన్లను వాడే వారికి ఈ ముప్పు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా రూపొందించిన మల్టీమీడియా ఫైల్స్‌ను చాట్స్ లేదా ఛానెల్స్‌లో దుండగులు అప్‌లోడ్ చేస్తున్నారు. అనుకోకుండా ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ యాప్ అయిన మాల్వేర్ మల్టీమీడియా ప్రివ్యూగా కనిపిస్తుంది. పైగా ఇది బైనరీ అటాచ్‌మెంట్ రూపంలో కూడా కనిపించడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఈ హానికరమైన ఫైల్ 30 సెకన్ల వీడియోలా కనిపిస్తోంది. పైగా ఈ ఫైల్ డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ అయ్యేలా ముష్కరులు టెలీగ్రామ్ సెట్టింగ్స్‌ను సెట్ చేశారు. వినియోగదారు సంబంధిత చాట్‌ను తెరిచిన వెంటనే ఈ మాల్వేర్ డౌన్‌లోడ్ అవుతుంది. 

టెలిగ్రామ్ యూజర్ వీడియో మీడియా ఫైల్‌ను క్లిక్ చేశాక, యాప్ ఎర్రర్ చూపిస్తుంది. అంటే తెలివిగా టెలీగ్రామ్ యాప్ ఎర్రర్ వచ్చిందనేలా వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ యూజర్ కంగారు పడి యాక్సెప్ట్ ఆప్షన్’ను ఎంచుకుంటే థర్డ్ పార్టీ పర్మిషన్ అడుగుతుంది. ఎప్పుడైతే యూజర్ దాన్ని ఓకే చేసి ఓపెన్ చేస్తాడో ఇక అంతే ఆ యాప్‌కు మీరు అన్ని పర్మిషన్లు ఇచ్చేసినట్లే. ఈ యాప్ ఇన్స్టాలేషన్ టెలిగ్రామ్ వినియోగదారుకు ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి యూజర్లకు కచ్చితంగా టెలీగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

bottom of page