విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్..
- MediaFx
- Aug 2, 2024
- 1 min read
విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. వాటిలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఒకటి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12 వ సినిమా ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. షార్ట్ హెయిర్ లో కనిపిస్తున్నాడు విజయ్. జర్సీ సినిమాతో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఒంటి నిండా దెబ్బలు, అలాగే ముఖంపై రక్తంతో వర్షంలో తడుస్తూ కనిపించాడు విజయ్.. రక్తం కారుతుండగా చాలా కోపంగా పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు విజయ్. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది.ఈ సినిమాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పోస్టర్ చూస్తుంటే.. ఈ మూవీతో విజయ్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.