top of page
Suresh D

ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె💔😢

📢 ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.

📢 ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. 🏠 చర్చ్ పార్క్ స్కూల్‌లో మీరా పన్నెండో తరగతి చదువుతోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో దుపట్టాతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావేరి ఆసుపత్రికి తరలించారు. 🏥 పరీక్షించిన వైద్యులు మీరా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 👨‍⚕️ కుమార్తె ఆత్మహత్య సమయంలో ఆంటోనీ ఇంట్లో లేరని సమాచారం. మీరా గతకొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటోందని సమాచారం. మార్కులు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం అందుతోంది. ప్రభుత్వ అధికారులు అసలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.చెన్నైలోని తేనాంపేట పోలీసులు మీరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిటీలోని ఓమంతురార్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


bottom of page