top of page

'నిప్పురవ్వ' తరువాత బాలయ్యతో అందుకే చేయలేదు

MediaFx

టాలీవుడ్ లో నిన్నటితరం హీరోయిన్ గా వెలుగొందిన విజయశాంతి, స్టార్ హీరోలందరి సరసన నటించారు. గ్లామర్ పరంగాను, నటన పరంగాను తనదైన ముద్ర వేసి, నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచారు. చిరంజీవి, బాలకృష్ణ సరసన ఎక్కువ సినిమాలలో కనిపించారు.

అయితే, 'నిప్పురవ్వ' సినిమా తరువాత బాలకృష్ణతో కలిసి నటించకపోవడం వెనుక అనేక కథనాలు వినిపించాయి. ఈ విషయంపై విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"బాలకృష్ణగారితో 'నిప్పురవ్వ' తరువాత నటించకపోవడానికి వేరే కారణమంటూ ఏమీ లేదు. ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను," అని చెప్పారు.

ఆమె వివరిస్తూ, "ఆ సమయంలోనే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వరుసగా సైన్ చేయడం, ఆ తరహా కథలే నాకు రావడం జరిగింది. నా సినిమాలు కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడేవి. అప్పుడు నేను తీసుకున్న పారితోషికం కూడా ఎక్కువ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ, యాక్షన్ సినిమాలు చేస్తాననీ, అంత బిజీ అవుతానని నేనే అనుకోలేదు. అందువల్లనే ఇతర హీరోలతో చేయలేకపోయాను" అని చెప్పారు.

 
bottom of page