top of page
Suresh D

మళ్లీ దొరికేసిన విజయ్-రష్మిక..🎥✨

"విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు".. నిన్నటి వరకూ ఇది నిజమే! కానీ ఈ వార్త చదివిన తర్వాత మాత్రం అబ్బఛా అవునా నిజమా? అనుకోవాల్సిందే. ఎందుకంటే విజయ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ పెట్టుకొని ఇంత అర్జెంట్‌గా దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? "రష్మిక బర్త్‌డే ఉంది" ఇంతకంటే ఏం కావాలి!రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై ఈ జంట ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. పోనీ కాదని కూడా చెప్పలేదు. కానీ ఇలా అడిగిన ప్రతిసారి ముసిముసినవ్వులు నవ్వుతూ ఉంటారు. కానీ చాలా సార్లు వీళ్లిద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లారని రుజువైంది. వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చూసి ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్ ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టేవారు. ఇక తాజాగా మరోసారి అలానే దొరికిపోయింది ఈ జంట.ప్రస్తుతం రష్మిక మందన-విజయ్ దేవరకొండ ఇద్దరూ దుబాయ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రష్మిక తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే దుబాయ్‌లో ఉన్నట్లు అర్థమైంది. అలానే ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ రష్మిక స్టోరీ పెట్టింది. ఇక ఇది జరిగిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే బ్యాక్ గ్రౌండ్‌లో గమనిస్తే అదే నెమలి మళ్లీ దర్శనమిచ్చింది. ఇంకేముంది ఈ రెండు స్టోరీలను క్లబ్ చేసి వీళ్లిద్దరూ సేమ్ ప్లే‌స్‌లో ఉన్నారంటూ ఫ్యాన్స్ స్టోరీ రాసేశారు. ఏప్రిల్ 5న రష్మిక బర్త్‌డే కావడంతో దుబాయ్‌లో పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారట. అందుకే రష్మిక-విజయ్ దుబాయ్ వెళ్లినట్లు టాక్.రష్మిక పుట్టినరోజు నాడే ఫ్యామిలీ స్టార్ కూడా రిలీజ్ అవుతుండటం విశేషం.✨


bottom of page