ఫ్యామిలీ స్టార్ మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీస్టార్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది. పరశురామ్ అందించిన కథ, అతడి టేకింగ్‌తో పాటు సినిమాలోని కామెడీ, సెంటిమెంట్ సీన్స్‌ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్‌పై పడినట్లు సమాచారం. శుక్రవారం రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 5.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. నైజాంలో ఈ మూవీ మూడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ గత మూవీ లైగర్ ఫస్ట్ డే 33 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌ను లైగర్ దక్కించుకున్నది. లైగర్ తో కలెక్షన్స్ పరంగా ఫ్యామిలీ స్టార్ ఏ మాత్రం పోటీపడలేకపోయింది. లైగర్ కంటే దాదాపు ఇరవై కోట్ల వరకు తక్కువగానే ఫ్యామిలీస్టార్‌కు కలెక్షన్స్ వచ్చాయి.🎥✨