top of page
Suresh D

ఈ రోజు 'ధృవ నక్షత్రం' రిలీజ్ లేదు - అఫీషియల్‌గా గౌతమ్ మీనన్ 🎞️🎥

చియాన్ విక్రమ్, గౌతమ్ మీనన్ అభిమానులకు నిరాశ. ఇవాళ ధ్రువ నక్షత్రం' సినిమా విడుదల కావడం లేదు.

విడుదల అవుతుందా? లేదా? ఇవాళ థియేటర్లలోకి వస్తుందా? లేదా? గురువారం ఉదయం నుంచి... ఆ మాటకు వస్తే బుధవారం నుంచి 'ధృవ నక్షత్రం' విషయంలో హైడ్రామా నెలకొంది. ఇప్పుడు సందేహాలు అవసరం లేదు. చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. 'ధృవ నక్షత్రం' సినిమా ఈ రోజు థియేటర్లలోకి రావడం లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అందుకు గాను ప్రేక్షకులకు సారీ కూడా చెప్పారు. బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో జనాలలో ముందు నుంచి సందేహం ఉంది. ఇప్పుడు అది నిజం అయ్యింది. సినిమాను విడుదల చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ... వీలు పడలేదని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ఒకట్రెండు రోజులు పట్టవచ్చని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతి ఇవ్వడానికి, ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్, సరిపడా థియేటర్లలో విడుదల చేయడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో తమ సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 🎞️🎥

bottom of page