తమిళ స్టార్ నటుడు విక్రమ్ ప్రస్తుతం తంగలాన్ సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్‌లో విక్రమ్‌కు హిట్ వచ్చిందంటే తంగలాన్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా తన ఫేవరేట్ దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చినట్లు తెలిపాడు.
మణిరత్నం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫిల్మ్ మేకింగ్ నచ్చడంతో ఆయన తీసిన సినిమాలన్ని చూశాను. అయితే నా కెరీర్ మొదట్లో మణిరత్నంతో ఒక్క సినిమా అయిన చేయాలి అనుకున్న. అన్నట్లుగానే బొంబాయి ఆఫర్ వచ్చింది. బొంబాయిలో ఫస్ట్ నేనే హీరోని. ఆ సినిమా ఆడిషన్‌లో చేసిన ఒక చిన్న తప్పు వలన బొంబాయి సినిమాలో అవకాశం పోగొట్టుకున్నాను. ఆ మూవీ ఆడిషన్‌లో నన్ను స్టిల్ కెమెరా ముందు నటించమన్నాడు. నాకు అర్థం కాలేదు. వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తీసుకువచ్చి నటించమంటున్నాడు ఏంటి అనుకున్నాను. నేను యాక్ట్ చేయలేదు. అలా బొంబాయి అవకాశం చేజారింది. దీంతో ఆ బాధను తట్టుకోలేక రెండు నెలలు ఏడుస్తునే ఉన్నాను. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన విలన్‌తో పాటు పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించాను. కానీ బొంబాయి వెలితి మాత్రం ఇంకా ఉంది అంటూ విక్రమ్ చెప్పుకోచ్చాడు.
తంగలాన్ విషయానికి వస్తే.. విక్రమ్, పా. రంజిత్ (Pa Ranjith) కాంబోలో వచ్చిన తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అయితే ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ పట్ల మూవీని హిందీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తంగలాన్ హిందీ వెర్షన్‌ను సెప్టెంబర్ 06న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది.