top of page
MediaFx

సూపర్ హిట్ విలన్ వినోద్ కిషన్ హీరో అవ్వాలనుకుంటున్నాడు!

సినిమా రంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటున్నారు. అందం, టాలెంట్ ఉన్న వాళ్లు బాగా లక్ కలిసొస్తే స్టార్ డమ్ పొందుతారు. కానీ కొంతమందికి అదృష్టం కలిసి రావడంలో విఫలం అవుతుంటారు. కొంతమంది కొత్త నటీనటులు వరుసగా ఆఫర్స్ అందుకుంటూ, తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. ఇక మరికొందరు తమకు వచ్చే అవకాశాలను ఎదురుచూస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొనాల్సిందే. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించాలి.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఓ కుర్రహీరో ఎదుర్కొంటున్నాడు. ఇన్నాళ్లూ సూపర్ హిట్ సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించిన వినోద్ కిషన్, ఇప్పుడు హీరోగా మారేందుకు సిద్ధమయ్యాడు. "పేకమేడలు" అనే సినిమాలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు డబ్బులు లేవని, సహాయం చేయాలని ప్రేక్షకులను అడుగుతున్నారు. యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు.

"తెలుగులో తొలిసారిగా హీరోగా 'పేకమేడలు' సినిమాలో నటించాను. లక్ష్మణ్ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇష్టం. సినిమా చాలా బాగా వచ్చింది. రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ, ప్రమోషన్స్ కోసం డబ్బులు కావాలి. మీరు రూ.5 లేదా రూ.10 ఎంతైనా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించండి. ప్లీజ్ హెల్ప్. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత వచ్చిన లాభాల నుంచి వడ్డీతో మీ డబ్బులు ఇచ్చేస్తా" అంటూ వినోద్ వీడియోలో రిక్వెస్ట్ చేశారు.

నెటిజన్స్ మాత్రం ఇది కేవలం ప్రమోషన్లలో భాగమని అంటున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఓ వీడియో లింక్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇంతా సినిమా ప్రమోషన్లలో భాగమే అని అర్థమవుతోంది.

bottom of page