అమ్మపాడే జోలపాట.. అమృతానికన్నా తియ్యనంట.. ఈ పాట సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ పాటకు రీల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. అద్భుతమైన వాయిస్‌తో, మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను జాహ్నవి ఎర్రం ఎంతో అందంగా ఆలపించింది. జాహ్నవి వాయిస్ హృదయాలను దోచేస్తోంది. ఎమోషనల్ కెనెక్ట్ ఉన్న ఈ పాట గురించి చాలా మందికి ఆసక్తి పెరిగింది.
జాహ్నవి ఎర్రం మహారాష్ట్రకు చెందిన తెలుగు మూలాలున్న అమ్మాయిగా తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలుగమ్మాయినే కానీ, తెలుగు మాట్లాడం రాదని అన్నారు. మిట్టపల్లి స్టూడియో కోసం ఈ అమ్మ పాటను పాడింది జాహ్నవి. సిస్కో డిస్కో సంగీతం అందించారు.
ఈ పాట మ్యూజిక్, లిరిక్స్ అందరికి కనెక్ట్ అవుతున్నాయి. జాహ్నవి పాట పాడిన తీరు నెటిజన్స్‌కు చాలా ఇష్టం. ప్రస్తుతం ఇన్ స్టాలో జాహ్నవికి 126 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.