top of page

ఫైనల్‌లో పరాజయం.. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టిన టీమిండియా క్రికెటర్లు.. 🏏🏆

బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా కొంతమంది జట్టు ఆటగాళ్లకు ఇది చివరి వన్డే ప్రపంచ కప్. సొంత మైదానంలో వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను ముద్దాడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆదివారం ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ వరకు అజేయంగా జట్టును నడిపించిన రోహిత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానాన్ని వీడడం అభిమానులను కలచివేసింది🏏🏆

ఈసారి ఎలాగైనా ప్రపంచకప్‌ టైటిల్‌ గెలవాన్న కల కలగానే మిగిలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్స్‌లో చతికిలపడింది. బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా కొంతమంది జట్టు ఆటగాళ్లకు ఇది చివరి వన్డే ప్రపంచ కప్. సొంత మైదానంలో వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను ముద్దాడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆదివారం ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ వరకు అజేయంగా జట్టును నడిపించిన రోహిత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానాన్ని వీడడం అభిమానులను కలచివేసింది. రోహిత్‌ పాటు కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలో కన్నీరుమున్నీరయ్యారు. ఒకానొక సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్.. చివరకు దుఃఖాన్ని ఆపుకోలేక మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వేగంగా వెళ్లిపోయాడు. గత నెల రోజులుగా ఈ ఒక్క టైటిల్ కోసం జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ రోహిత్ ప్రదర్శన అసాధారణం. కానీ చివరి దశలో టైటిల్ కోల్పోయామన్న నైరాశ్యం కెప్టెన్ రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.


 
 
bottom of page