top of page
Suresh D

భారత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20ల్లో రోహిత్, కోహ్లీ రీఎంట్రీ..🏏🌟

టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించారు. కఠినమైన పర్యటనలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను సమం చేసింది. చివరి రెండు టెస్టులు కూడా 1-1తో డ్రా అయ్యాయి. భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పుడు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించారు. కఠినమైన పర్యటనలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను సమం చేసింది. చివరి రెండు టెస్టులు కూడా 1-1తో డ్రా అయ్యాయి. భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పుడు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. రెండు ఆసియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ భారతదేశంలో జనవరి 11 న మొహాలీలో ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్‌ జనవరి 14న ఇండోర్‌లో, చివరి మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరగనుంది.

స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు భారత సెలక్టర్లు శుక్రవారం (జనవరి 5) జట్టును ప్రకటించనున్నారు. జట్టు ప్రకటనకు ముందు, బ్యాటింగ్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మళ్లీ భారతదేశం కోసం టీ20 క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. నవంబర్ 10, 2022న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022 రెండో సెమీ-ఫైనల్‌లో మెన్ ఇన్ బ్లూస్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైనప్పటి నుంచి వీరిద్దరూ భారతదేశం తరపున ఒక్క టీ20ఐ కూడా ఆడలేదు.

ఇప్పుడు ఈ జోడీ 2024 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పునరాగమనం చేసేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం, రోహిత్, కోహ్లీ టీ20 క్రికెట్ ఎంపిక కోసం తాము అందుబాటులో ఉన్నామని బీసీసీఐకి తెలిపారు. తద్వారా అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20కి ఎంపికవుతారని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ భారత్‌కు చివరి ద్వైపాక్షిక టీ20ఐ సిరీస్ ఇదే కావడంవ విశేషం. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌, యూఎస్‌ఏల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20ల నుంచి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని సమాచారం. కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా, సిరాజ్ లు జట్టును విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు. న్యూలాండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.🇮🇳🏏

bottom of page