top of page

ప్లీజ్ నన్ను అలా పిలవకండి.. 🙏

Suresh D

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ అనగానే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీనే. టెస్టు అయినా, వన్డే అయినా, టీ20 అయినా పరుగుల వరద పారాల్సిందే. అందుకే కోహ్లికి కింగ్ అని పేరొచ్చింది. లోకల్ నాన్ లోకల్ గ్రౌండ్ ఏదైనా కోహ్లీ రాణిస్తుండటంతో అభిమానులు ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన అభిమానులను ఓ సందేశం పంపారు. తనను ‘కింగ్’ అని పిలవడం మానేయాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) స్టార్ విరాట్ అభిమానులను కోరాడు. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్‌సీబీ ఈవెంట్‌లో ప్రేక్షకులను ఉద్దేశించి కోహ్లీ ఈ విజ్ఞప్తి చేశాడు.🏏👑



 
bottom of page