విశాల్ హీరోగా నటించిన తాజా సినిమా 'మార్క్ ఆంటోనీ'. ఇందులో ఎస్.జె. సూర్య విలన్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే. .?
'మార్క్ ఆంటోనీ' ప్రారంభమైన కాసేపటికి కథను, కథనాన్ని కామెడీ & ఎస్.జె. సూర్య టేకోవర్ చేసేశారు. ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇంటర్వెల్ వరకు విశాల్, ఎస్.జె. సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా బావున్నాయి. కామెడీకి తోడు జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడు కావడంతో ప్రేక్షకులు ఆంటోనీ ప్రపంచంలోకి వెళతారు. కొంత వరకు ట్రావెల్ చేస్తారు. సినిమా సరదాగా ముందుకు వెళుతుంది. విశ్రాంతి తర్వాత బండి చాలా భారంగా ముందుకు వెళుతుంది.
టైమ్ ట్రావెల్ జానర్ మూవీస్ అంటే రిపీట్ సీన్స్ ఉండటం సహజం! ఇంటర్వెల్ తర్వాత 'మార్క్ ఆంటోనీ'లో రిపీట్ సీన్స్ మరీ ఎక్కువ అయ్యాయి. కథ ఎంతకూ ముందుకు కదలదు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ తగ్గి... కన్‌ఫ్యూజన్ స్టేజి స్టార్ట్ అవుతుంది. చివరకు వచ్చేసరికి ముగింపు కోసం ఎదురు చూసేలా చేశారు. అసలు కథకు రీతూ వర్మతో ప్రేమకథలు అడ్డు తగిలాయి.
జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమా ప్రారంభం నుంచి డామినేట్ చేసింది. రెట్రో థీమ్ రీ రికార్డింగ్ బాగా చేశారు. అయితే... చివరకు వచ్చేసరికి ఆ నేపథ్య సంగీతం కూడా రొటీన్ అనిపించింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. యాక్షన్ సీన్లు రొటీన్ అనిపించాయి.
టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తీసిన ఫిల్మ్ 'మార్క్ ఆంటోనీ'. సరదాగా సాగే ఫస్టాఫ్... తెరపై ఏం చేస్తున్నామో తెలియకుండా కన్‌ఫ్యూజ్ చేసే సెకండాఫ్... కథను డామినేట్ చేసిన ఎస్.జె. సూర్య నటన... ఓ రోలర్ కోస్టర్ రైడింగ్ ఫీల్ ఇస్తుందీ సినిమా. నటుడిగా విశాల్ వైవిధ్యం ఒప్పించారు. కొంత వరకు కామెడీ నవ్విస్తుంది. కాసేపు నవ్వుకోవడానికి, ఎస్.జె. సూర్య నటన కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళండి. 🎥🎞️