top of page
Suresh D

‘రత్నం’ ఫస్ట్ లుక్: ఒక చేతిలో కత్తి.. ఇంకో చేతిలో తల.. వామ్మో విశాల్!🎥✨

తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రత్నం'. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సింగం' సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక వ్యక్తి తలను నరికి, దాన్ని చేత్తో పెట్టుకుని, మరో చేత్తో రక్తం కారుతున్న కొడవలిని పట్టుకుని విశాల్ భయంకరంగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. విశాల్ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. 🎥✨



bottom of page