top of page
Shiva YT

🌊 కృష్ణా నదిలో అయోధ్య బాలరాముని పోలిన విష్ణువు! 🌈

కర్ణాటకలోని కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయటపడింది. రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నదిలో బయటపడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం ఆశ్చర్యపరుస్తోంది.

విగ్రహం చుట్టూ దశావతారాలు కనిపించాయి. విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయటపడింది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలను అందంగా మలిచారనీ అన్నారు. ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపించాయి. 🌺


bottom of page