యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి.
విభిన్న కథ కథనాలతో ఆకట్టుకునే రీతిన రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయం సొంతం చేసుకుంది.కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీలో అభినయ, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, మొహమ్మద్ సమద్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, కన్నడ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోని ఈ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంత మేర స్పందన లభిస్తుందో చూడాలి.🎥✨
'సామజవరగమన' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీ విష్ణు.. శ్రీ హర్ష కొనుగంటితో 'ఓం భీమ్ బుష్' అనే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి ఓ రేంజ్‌లో నవ్వించాడు శ్రీవిష్ణు. సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ కుమార్, రచ్చ రవి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ MR మ్యూజిక్ ఇచ్చారు.🎥✨