top of page
MediaFx

ఈ సీజన్ లో ముంబైకి సమీపంలో అందమైన ప్రదేశాల్లో పర్యటించండి..


ముంబై కలల నగరం అని చెబుతారు. సందర్శన పరంగా ఈ ప్రదేశం ఇతర పర్యాటక ప్రదేశాల కంటే తక్కువ కాదు. ఈ ప్రదేశం అందం మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ వర్షాకాలంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించాలి. వీటిని సందర్శించడం వలన మనసు ప్రసాంతంగా ఉంటుంది. రీచార్జ్ అయిన ఫీలింగ్ ని ఇస్తుంది.

తపోల: వర్షాకాలంలో సందర్శించడానికి తపోలా మహారాష్ట్రలోని ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. దీని అందం కారణంగా దీనిని పశ్చిమ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇది ముంబై నుంచి 300 కిలోమీటర్ల దూరంలో.. పూణే నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శివసాగర్ సరస్సు సమీపంలో విస్తరించి ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఆనందించవచ్చు. భీమశంకరం: ఆధ్యాత్మికత ప్రదేశం భీమశంకరం.అయినప్పటికీ ఇక్కడ అందమైన జలపాతం, వన్యప్రాణుల అభయారణ్యం కూడా చూడవచ్చు. వర్షాకాలంలో ఇక్కడి దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మీరు షిడీ ఘాట్ నుండి గణేష్ ఘాట్ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు.

మాథెరన్: నగరం జీవితం నుంచి ఉరుకులు పరుగులకు దూరంగా కొన్ని ప్రశాంతమైన క్షణాలను గడపాలని కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మాథేరన్‌ను అన్వేషించాలి. ఇక్కడ మీరు ప్రకృతిని చాలా దగ్గరగా చూడవచ్చు. ఈ అందమైన ప్రదేశం ముంబైకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఇక్కడి దృశ్యం మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకర్షిస్తుంది.

bottom of page