యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ముంబైలో అడుగుపెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌ను చూసేందుకు విమానాశ్రయం వద్ద అభిమానులు ఎగబడ్డారు.
దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘వార్ 2’ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్ 2లో ఎన్టీఆర్ లుక్ అంటూ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. దేవర సినిమా కోసం కాస్త గడ్డం, ఉంగరాల జుట్టుతో కనిపించిన ఎన్టీఆర్.. వార్ 2 సినిమా కోసం తన లుక్‌ను కాస్త మార్చుకున్నారు. హృతిక్ రోషన్ హీరోగా 2019లో విడుదలైన వార్ చిత్రానికి సీక్వెల్‌గా వార్ 2ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. వార్ 2లో హృతిక్ రోషన్‌కు విరోధిగా ఎన్టీఆర్ నటించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. వార్ 1లో హృతిక్‌తో పాటు టైగర్ ష్రాఫ్ నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా 2015 ఆగస్టు 14న వార్ 2 సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.🎥✨