పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం…కేటీఆర్
- MediaFx
- Aug 8, 2024
- 1 min read
బీఆర్ఎస్‌పై కక్ష పూరిత దుష్ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో చిత్తశుద్ధితో, 24 ఏళ్ళ పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడామని స్వరాష్ట్రానీ సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకుని, అభివృద్ధిలో నిలిపామని కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. దుష్ప్రాచారాలు మానుకోవాలని హితవు పలికిన కేటీఆర్.. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ స్పష్టం చేశారు.