top of page
Suresh D

శబరిమల అయ్యప్ప భక్తులకు అలెర్ట్.. కేరళలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడే అవకాశం.. ⚠️🌧️🌊

కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రకృతి విపత్తులు కూడా సంభవించే ప్రమాదం కూడా ఉందని సూచించారు. 🚨🌧️🌊 బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలతో సహా కేరళ, తమిళనాడులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఈ వారంలో రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 🌧️🚨


bottom of page