👩🍳 "ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు" అని సామెత మన తెలుగులో ఎంత ప్రసిద్ధమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బర్గర్‌ల నుండి ఫ్రైస్ వరకు ప్రతిదానికీ ఉల్లి తీయాల్సిందే. అయితే 1 నెల ఉల్లిపాయలు తినకపోతే ఏమవుతుందో చూద్దాం.
పోషకాహార పవర్‌హౌస్
ఉల్లిపాయలు కేవలం రుచి కోసం కాదు, అవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
విటమిన్ పవర్
ఉల్లిపాయలలో విటమిన్ సి, బి6, ఫోలేట్ ఉంటుంది. ఇవి బలమైన రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియకు అవసరం.
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు
ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి.
ఫైబర్‌కు ఆనియన్ మంచి సోర్స్
ఉల్లిపాయలు డైటరీ ఫైబర్‌కు మంచి సోర్స్. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ అవసరం. ఉల్లిపాయలు తినడం ఆపేస్తే మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి.
పోషకాహార లోపం
ఉల్లిపాయల్లో అల్లిసిన్, క్వెర్సెటిన్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఉల్లిని తీసుకోకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
ఉల్లిపాయలను తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు
ఉల్లిపాయలు అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. మీ ఆహారం నుండి వాటిని తొలగిస్తే, ఆ పోషకాల లోపాలకు దారి తీస్తుంది. వీటిని దూరంగా పెడితే మాంగనీస్, పొటాషియం, విటమిన్లు సి, బి6, ఫోలేట్ వంటి పోషకాలు శరీరానికి అందవు. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. అలసట, రక్తం గడ్డకట్టడం, ఎర్ర రక్త కణాల డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి.