సమ్మర్ వచ్చేసింది. ఈ వేడిని తట్టుకోవడానికి చాలా మంది కూడా డ్రింక్స్‌పై ఆధారపడతారు. అవి హెల్దీనే. కానీ, వీటిని తాగేందుకు చాలా మంది ప్లాస్టిక్ స్ట్రాల్ వాడడం సరైన పద్ధతి కాదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కరిగిపోవడానికి చాలా రోజులు పడుతుంది. ఇది మట్టిలో కలిసినప్పుడు విషపూరితంగా మారుతుంది. దీని వల్ల మొక్కలు, వన్యప్రాణాలు, చేపలు, మానవులకి మంచిది కాదు.
స్ట్రాలు..
స్ట్రాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇందులో BPA ఫ్రీ అని మెన్షన్ చేసినప్పటికీ, అవి కూడా పర్యావరణానికి హాని కలిగించే ఇతర హానకర రసాయనాలు కలిగి ఉంటాయి. వీటిని రీసైకిల్ చేయడం కష్టం. పూర్తిగా భూమిలో కలవడానికి ఏళ్ళకి ఏళ్ళు గడుస్తాయి. కాబట్టి, వీటిని వాడకపోవడమే మంచిది.
విచ్ఛిన్నం కాకుండా..
ఈ ప్లాస్టిక్ స్ట్రాలు పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా చిన్న చిన్న కణాలుగా విడిపోయి పర్యావరణంలో ఎక్కడో ఒకచోట ఉండి పర్యావరణానికి హానిచేస్తాయి. డయాక్సిన్ ఉద్గారాలను విడుదల చేయడం వల్ల వీటిని కాల్చడం కూడా మంచిది కాదు.
ఎక్కువగా వాడితే..
ఈ ప్లాస్టిక్ స్ట్రాలని ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల నోటిలో గాయాలు, కంటి గాయాల, శ్వాస సమస్యలు, ఇతర సమస్యలొస్తాయి.
జల కాలుష్యం..
వీటిని నీటిలో, వాగులు, చెరువులు, సముద్రాల్లో వేసినప్పుడు కూడా అవి జల చర జీవరాశులకి మంచిది కాదు. అందుకే వాటిని చెత్తగా నీటిలో పారవేయడం మంచిది కాదు. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది స్ట్రాలని వాడతున్నారు. ఇవి తిరిగి చెత్తగా మారి పర్యావరణంలోకి చేరి చాలా సమస్యలకి కారణంగా మారుతుంది.
వీటి బదులు..
ప్లాస్టిక్ స్ట్రాలని వాడే బదులు స్టెయిన్ లెస్ స్టీల్, మెటల్, పేపర్ స్ట్రాలని వాడడం మంచిది. దీని వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.