ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ యాత్రకు పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ ను చూసేందుకు, యాత్రలో భాగమయ్యేందుకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బస్సు యాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బస్సు యాత్రలో జగన్ బిజీగా ఉండగా ఆయన్ను చూసేందుకు ఓ విద్యార్థి గట్టిగా కేకలు పెట్టాడు. జగన్ మామయ్య అంటూ పిలవడంతో బస్సు నిలిపివేసి కిందకు దిగి వచ్చి మరి అప్యాయంగా నుదుటిపై ముద్దు పెట్టాడు. మరికొంతమంది పిల్లలతో సీఎం జగన్ సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో పొలిటికల్ సర్కిల్ వైరల్ అవుతున్నాయి.
బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రకాశం జిల్లా కొనకమెట్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. పేదలకు మేలు జరగకుండా చేస్తున్న చంద్రబాబు పెద్ద శాడిస్ట్ అని విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేసి చూపించామన్నారు. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు ఎన్నికల్లో విపక్షాలు కూటమి వస్తున్నాయని.. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంకావాలని జగన్ పిలుపునిచ్చారు.