top of page
MediaFx

పెద్దల ఆశీర్వాదం వెనుక రీజన్ ఏమిటంటే..?


హిందూ మతం ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని, సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం ఇస్తూ.. సుఖ సంతోషాలతో ఉండండి.. ఆర్ధికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళీభవ, సంతాన ప్రాప్తిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తారు.

ఇంట్లోని పెద్దలు పిల్లలు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు. అయితే దీర్ఘ సుమంగళీభవ, సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు? అంటే కోడలు పెళ్లయ్యి.. అత్తవారింటిలో అడుగు పెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన భాద్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లికూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలు ఇస్తారు.ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవ దంపతులు సంతోషంగా, సుఖ శాంతులతో పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం. మరోవైపు స్త్రీ ఒడిని పండ్లలో నింపి ఇచ్చే దీవెనలు మహిళలకు చాలా ప్రత్యేకమైనవి. కొంతమంది నవ వధువుకి పసుపు పాలతో స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల చర్మానికి కూడా ముఖ్యమైనది. అంతే కాదు పుట్ట బోయే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటాడని విశ్వాసం. ఈ ఆశీర్వాదం పురుషులు, మహిళలు ఇద్దరూ సంతోషకరమైన , సంపన్నమైన జీవితాన్ని జీవిస్తారని విశ్వాసం.

bottom of page