పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం గత వారం విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మరి కొద్ది రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కురుక్షేత్ర యుద్ధం ముగింపుతో మొదలై కలియుగం ముగింపుతో ముగుస్తుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలను కూడా ఈ సినిమాలో చూపించాడు . అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృష్ణుడి పాత్రలు హైలెట్ గా నిలిచాయి. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి ముఖం చూపించలేదు. ‘కల్కి 2898 AD’ సినిమా ప్రారంభంలోనే కృష్ణుడిని చూపించారు. కానీ ఇక్కడ కృష్ణుడి ముఖం మాత్రం కనిపించదు. ఆ తర్వాత మరో రెండు సన్నివేశాల్లో కృష్ణుడి పాత్ర వస్తుంది. అయితే అప్పుడు కూడా కృష్ణుడి ముఖం కనిపిందు. కృష్ణుడి ముఖం ప్రేక్షకులకు ఎదురుగా ఉన్నా.. వెనుక నుండి వచ్చిన కాంతి అతని ముఖం కనిపించకుండా చేసింది. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర కు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఈ సీన్స్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆడియెన్స్ ను కట్టిపడేసింది.ఇదిలా ఉంటే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణ ముఖాన్ని ఎందుకు చూపించలేదనే విషయంపై మాట్లాడారు. ‘మొదటి నుంచి కృష్ణుడి ముఖం చూపకుండా షాడో మోడల్ లేదా ఇమేజ్ మోడల్‌ను మాత్రమే చూపించాలనే ఆలోచన మాకు ఉంది. అలా కాకుండా ఆ పాత్ర (కృష్ణుడు) ఒక వ్యక్తి లేదా యాక్టర్‌లానే ఉండిపోతుంది. కృష్ణుడిని ముదురు రంగులో చీకటి రూపులో (ఆకారం)చూపించాలని ఉండేది. కృష్ణుని ముఖాన్ని చూపించడానికి ఎలాంటి ప్లాన్ లేదని, ఆయనను అలానే చూపించడం కొనసాగిస్తాం. మనం కృష్ణుడిని ఒక అసాధారణమైన వ్యక్తిగా మనసులో పూజిస్తున్నాం. ‘ అని నాగ్ అశ్విన్ అన్నారు.‘కల్కి 2898 AD’ సినిమా రెండో భాగంలో కూడా కృష్ణుడి పాత్ర ఉంటుందని, ఆ పార్ట్ లో కూడా కృష్ణుడి ముఖం కనిపించదని నాగ్ అశ్విన్ తెలిపాడు. తమిళ నటుడు కృష్ణ కుమార్ కృష్ణ పాత్రలో మెరిశారు. ‘సురారై పోట్రు’తో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో కృష్ణ కుమార్ సైగా నటించారు. ఈ పాత్రలో అతని ముఖం కనిపించకపోయినా, అతని నడవడిక, కదలికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ పాత్రకు ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్టిస్ట్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.