top of page
Suresh D

వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.?✨

వాట్సాప్‌.. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా కనిపించే యాప్స్‌లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌ ఏదైనా ఉందంటే అది వాట్సాప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి పెరుగుతోన్న డిమాండ్‌ నేపథ్యంలో మెటా కూడా ఈ దిశగా అడుగులు వేసింది.ఇందులో భాగంగానే మెటా ఏఐ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ చాట్స్‌ ఓపెన్ చేయగానే రౌండ్‌ షేప్‌లో ఒక సింబల్‌ కనిపిస్తోంది. దీంతో ఇది ఏంటా అని చాలా మంచి అనుకుంటున్నారు. ఇంతకీ వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ఏంటి.? దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెటా తీసుకొచ్చిన ఈ ఏఐ సెర్చ్‌ టూల్‌ అచ్చంగా చాట్‌ జీపీటీలా పనిచేస్తుంది. రౌండ్‌ సింబల్‌ను క్లిక్ చేయగానే ‘మెటా ఏఐ విత్‌ లామా’ అనే చాట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్తుంది. ఇందులో కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చాట్‌ బాట్ కేవలం ఇంగ్లిష్‌లోనే ఉంది. అయితే ఇతర భాషాల్లో కూడా అందిస్తారేమో చూడాలి.✨

bottom of page