బరువు తగ్గాలంటే వాకింగ్ ఎప్పుడు చేయాలి?
- MediaFx
- Aug 25, 2024
- 1 min read
ఉదయం, సాయంత్రం నడకలు రెండూ బరువు తగ్గడానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే రెండింటి ప్రభావం అవి మీ దినచర్యకు ఎంతవరకు సరిపోతాయి? మీ శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత షెడ్యూల్, శక్తి స్థాయిలు, జీవనశైలికి సరిపోయే సమయాన్ని ఎంచుకోవడం కీలకం. మీరు ప్రశాంత వాతావరణంలో నడవాలనుకుంటే ఉదయాన్నే నడవండి. మార్నింగ్ వాక్ రోజుకి కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈవినింగ్ వాక్ అంటే ఇష్టమైతే సాయంత్రం వేళల్లో నడవండి. ఒక రోజు పని లేదా ఇతర కార్యకలాపాల తర్వాత, సాయంత్రం నడక విశ్రాంతి, ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో నడవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతారు. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలతో పాటు మీ రోజువారీ జీవితంలో నడవడం మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.