top of page
MediaFx

చెట్టు పైనుంచి బుసలు..ఏంటా అని చెక్ చేయగా..


12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రా.. దాన్ని చూస్తేనే గుండెల్లో దడ పుడుతోంది. దగ్గరకు వెళ్తే.. పడగ విప్పి బుసలు కొడుతోంది. అలాంటి పామును చాకచక్యంగా రెస్క్యూ చేశారు కర్ణాటకలోని వన్యప్రాణి అధికారులు. అగుంబే గ్రామ ప‌రిస‌రాల్లో సంచ‌రిస్తున్న కింగ్ కోబ్రాను బంధించి, అడవిలో వదిలారు. అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS) ఫీల్డ్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న అజయ్ గిరి ఆ పాము వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ పాము రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు స్థానికులు చూశారు. 12 అడుగులు ఉన్న పెద్ద కింగ్ కోబ్రాను చూసి జనం కంగుతిన్నారు. తర్వాత అది ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లి చెట్టుపైకి ఎక్కింది.  గ్రామ‌స్థులు వెంట‌నే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. వాళ్ల టీంతో అజయ్ గిరి వ‌చ్చి పామును ప‌ట్టేశారు. ఆ త‌ర్వాత రెస్క్యూ బ్యాగ్‌లో బంధించి.. అనంతరం స్థానికులు, అటవీశాఖ అధికారుల సమక్షంలో పామును అడవిలోకి వదిలారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 13,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న అజయ్ గిరి తరచూ పాములను రక్షించే వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసిన చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాము ఇంత పెద్ద పామును ఎప్పుడూ చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను దిగువన చూడండి…


bottom of page