top of page
Suresh D

విజయ్ “ది గోట్” నుండి విజిల్ పోడు సాంగ్ రిలీజ్..!✨


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది గోట్ (The greatest of all time). ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి మేకర్ ఫస్ట్ సింగిల్ ను తాజాగా విడుదల చేసారు.విజిల్ పోడు అంటూ సాగే ఎనర్జిటిక్ సాంగ్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. AGS ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.✨

bottom of page