తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackrey) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని..
హైకమాండ్ నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు నిర్ణయిస్తుందని తెలిపారు. ఇటీవల ములుగు ఎమ్మెల్యే సీతక్కను కూడా సీఎం చేయొచ్చని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackrey) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై స్పందించారు. సీఎంగా ఎవరికైనా అవకాశం దక్కొచ్చని..అయితే దాని గురించి ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackrey) ఆరోపించారు. ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ప్రచారం చేస్తుందని రైతులకు కాంగ్రెస్ పార్టీనే మేలు చేసిందన్నారు. అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తుందని విమర్శించారు.