top of page
MediaFx

🍺 మద్యం తాగిన తర్వాత వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా? 🍺


ఓటు హక్కు ఉన్నట్లే మద్యం సేవించేందుకు కూడా ఓ నిర్ణీత వయసు ఉంటుంది. 18 ఏళ్లు నిండినవారు మాత్రమే మద్యం సేవించేందుకు అర్హులు. 18 ఏళ్లలోపు మద్యం సేవిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాల్లో మద్యం సేవించేందుకు నిర్ణీత వయసును ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొన్ని చోట్ల 18 నిండని వారు పబ్‌లకు వెళ్లడంపైనీ నిషేధం ఉంది.

అయితే, చాలామంది యువకులు రహస్యంగా 18 ఏళ్లు రాకముందే మద్యం సేవిస్తుంటారు. తాగిన తర్వాత వాంతులు చేసుకుని, అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?

ప్రతి ఒక్కరి శరీరం ఆల్కహాల్ సేవించిన తర్వాత భిన్నంగా స్పందిస్తుంది. ఒక నిర్ణీత పరిమితి తర్వాత మద్యం సేవించడం వల్ల వాంతులు అవుతాయి. సాధారణంగా తాగిన తర్వాత మైకం వస్తుంది. కానీ అతిగా తాగితే పొట్టపై ఒత్తిడి పడి, వాంతులు అవుతాయి.

ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది ఎసిటాల్డిహైడుగా మారుతుంది. ఇది విషపూరితమైనది. మన కాలేయం ఈ ఎసిటాల్డిహైడ్‌ని కొంత వరకు మాత్రమే ప్రాసెస్ చేయగలదు. మీరు ఒక నిర్దిష్ట పరిమాణం కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే, దానిని కాలేయం ప్రాసెస్ చేయలేక పోవడంతో వాంతులు అవుతాయి. ఈ ఎసిటాల్డిహైడ్ వాంతి ద్వారా శరీరం నుంచి బయటకు పోతుంది. వాంతి తర్వాత డీహైడ్రేషన్ కూడా తలెత్తుతుంది, ఎందుకంటే శరీరంలో నీరు అధికంగా పోతుంది.

bottom of page