టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లతో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని మారుతి లేదా హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లు అందించవు. అవి ఏంటో తెలుసుకుందాం.
iCNG టెక్నాలజీ: టాటా CNG కార్లలో iCNG సాంకేతికత అందించబడుతుంది. ఇందులో నేరుగా సిఎన్‌జి మోడ్‌లో కారును స్టార్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ ఏ ఇతర కంపెనీల సీఎన్‌జీ కార్లలో అందుబాటులో లేదు. ఇతర వాటిలో కారు మొదట పెట్రోల్‌తో ప్రారంభమవుతుంది. తరువాత సీఎన్‌జీ మోడ్‌కు మారుతుంది. దీని కారణంగా పెట్రోల్ కూడా వృధా అవుతుంది. కానీ టాటా సీఎన్‌జీ కార్లలో ఇలాంటి సిస్టమ్ లేదు. ట్విన్-సిలిండర్ టెక్నాలజీ: ఇప్పుడు టాటా సీఎన్‌జీ కార్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని తన సీఎన్‌జీ కార్లలో అందిస్తోంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, బూట్ స్పేస్ అందించడంలో సహాయపడుతుంది. నిజానికి ఒక పెద్ద సీఎన్‌జీ సిలిండర్ స్థానంలో, రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లు అందించడం జరిగింది. సీఎన్‌జీతో AMT గేర్‌బాక్స్: ఇటీవల టాటా మోటార్స్ దాని సీఎన్‌జీ మోడల్స్ టియాగో, టిగోర్‌లలో AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌ను జోడించింది. దీనితో ఇది భారతదేశంలో ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ కారుగా అవతరించింది. అయితే హ్యుందాయ్, మారుతి సీఎన్‌జీ కార్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తాయి. అంటే మీకు సీఎన్‌జీతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలంటే టాటా మోటార్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 🚗🌐