top of page
MediaFx

బాలకృష్ణతో చిరంజీవి ఫ్యాక్షన్‌ సినిమా.. ఇక అభిమానుల కల నెరవేరనుందా..?


టాలీవుడ్‌ నటుడు నందమూరి బాలకృష్ణ (Chiranjeevi) తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారని తెలిసిందే. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు టాలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణకు సెఫరేట్‌ ఫ్యాన్ బేస్‌ ఉందని తెలిసిందే. ఈ ఇద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే.. బాక్సాఫీస్‌ వద్ద క్రేజ్ ఎలా ఉండేదో మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈవెంట్‌ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాలకృష్ణతో సినిమా చేయాలనుందని చేసిన కామెంట్స్‌ ఇప్పుడు మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.

ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. బాలయ్య 50 ఇయర్స్‌ జర్నీ సెలబ్రేషన్స్‌లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుకలు మాత్రమే కాదు.. మొత్తం తెలుగు సినీ పరిశ్రమది. తెలుగు ప్రజలతో నందమూరి తారకరామారావు అనిర్వచనీయమైన అనుబంధం ఉంది. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభమైన విషయమేం కాదు. ఐదు దశాబ్దాలుగా బాలకృష్ణ హీరోగా విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు హెల్త్‌కేర్‌ అమూల్యమైన సేవలందిస్తున్నారన్నాడు.

నేను ఇంద్రలో నటించేందుకు బాలకృష్ణ నటించిన సమర సింహారెడ్డి సినిమానే స్పూర్తి.. నాకు బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్ సినిమా చేయాలనుంది అని చెప్పాడు చిరంజీవి. మా అభిమానులు ఒకరితోఒకరు గొడవ పడేవారు. నేను, బాలయ్యతోపాటు ఇతర హీరోలు మా ఆత్మీయ సంబంధాన్ని ప్రదర్శించడానికి అనేక కార్యక్రమాలలో పాల్గొనేవాళ్లం. ఆ తర్వాత మా అభిమానులు కూడా ఇతర హీరోల అభిమానులతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. బాలకృష్ణ లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు. బాలకృష్ణకు భగవంతుడు జీవితాంతం అపరిమిత శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. బాలయ్య చిరకాలం జీవించాలని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చిరు చేసిన తాజా కామెంట్స్‌తో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నెరవేరబోతుందంటూ అప్పుడే ఇండస్ట్రీ సర్కిల్‌లో జోరుగా టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ సరైన కథ, డైరెక్టర్‌ దొరికి ఈ ఇద్దరు ఫ్యాక్షన్‌ సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ ఆల్‌ టైమ్‌ రికార్డ్స్‌ బద్దలవడం గ్యారంటీ అని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.




bottom of page