top of page
Suresh D

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా..? విలనా..?🎥✨


టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హను మాన్ (Hanu man) మూవీ ఈ ఏడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు హీరో తేజ సజ్జ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. మిరాయ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, రితిక నాయక్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో మనోజ్ సెకండ్ హీరోగా కనిపిస్తారా.? లేక విలన్ గా నటిస్తున్నారా.? అన్నది తెలియాల్సి ఉంది. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజ సజ్జ సూపర్ యోధ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18, 2025 న వరల్డ్ వైడ్ గా 2డి మరియు 3డి ఫార్మాట్ల లో రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 🎥


bottom of page