మరణాన్ని అధిగమించడానికి శాస్త్రం సహాయం చేస్తుందా? 🌟
- MediaFx
- May 30, 2024
- 1 min read
మన జీవితంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని ఎదుర్కొంటారు, కానీ మనమంతా ఎప్పటికీ జీవించాలనే ఆశపడతాం కదా? చివరి క్షణంలోనూ కొంత సమయం కోసం ఆశపడతాం. ఇదే శరీరంతో కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రశ్న, ఈ ఆశ్చర్యం అందరిలోను ఉంది.
భగవద్గీతలో పుట్టినవానికి మరణం తప్పదని, మరణించినవానికి పుట్టుక తప్పదని చెప్పారు. అందుకే పునర్జన్మపై చాలా మంది నమ్మకం ఉంటారు. నిపుణులు చెబుతున్నట్టు ఒకరు చనిపోయినప్పుడు శరీరంలోని వివిధ శక్తులు క్రమంగా నశిస్తాయి. మొదట శరీరం, తర్వాత ఇంద్రియాలు, చివరగా శ్వాస. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో శరీరంతో పాటు సమస్త అవయవాలను పునరుద్ధరించే ప్రయోగం జరుగుతోంది.
ప్రత్యేకమైన స్లీపింగ్ బ్యాగ్‌లో చనిపోయినవారిని చుట్టి, డ్రై ఐస్‌లో ప్యాక్ చేసి, శరీర ఉష్ణోగ్రతను మైనస్ 80 డిగ్రీల సెల్సియస్‌కి తగ్గించి అవయవాలు పాడవకుండా చూడటం. పునర్జన్మపై విశ్వాసాలు ఉన్నా, ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ప్రయోగం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, మరణాంతరం శరీరాలను భద్రపర్చడం ఒక పెద్ద వింత.అసలు ఈ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల ప్రయోగం ఫలిస్తుందా? మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.