top of page
MediaFx

నడిరోడ్డుపై మహిళ వింత పూజలు..


వైరల్‌ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్, ఆయిల్, బ్యాగ్ తీసుకుని కూర్చుంది. ఆ తరువాత అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. మొదట్లో కొంత మంది ఆ మహిళను దాటకుంటూ వెళ్లిపోతున్నారు. అంతలో ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది. దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడిక్కడే ఆగిపోయారు. అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ ఏదో వికృతంగా ప్రవర్తించింది. ఆ తరువాత మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని మరింత విచిత్రంగా ప్రవర్తించింది. ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా, ఆ తరువాత ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి బయలుదేరడం ప్రారంభించాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నడిరోడ్డుపై విచిత్ర పూజలు చేసిన సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తరువాత తెలిసింది. అందువల్లే ఆమె నడిరోడ్డుపై కూర్చుని ఇలా పూజలు చేస్తుండగా, అందరూ ఆమె మంత్రాలు చేస్తుందని భయపడ్డారు. ఆమె వింత ప్రవర్తన చూసిన కొందరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె వింతగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏది స్పష్టంగా లేదు. వీడియో వైరల్‌గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను వెతకడానికి ఆమె ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని భర్త చెప్పాడు. కొన్నిసార్లు ఆమె ఇలాంటి వింత పనులు చేస్తుందని చెప్పారు.



bottom of page