top of page
Suresh D

ఎన్నికల వేళ చిక్కులో రేసు గుర్రం నటుడు..🗳️

రేసు గుర్రం సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు నటుడు రవికిషన్.. ఈ భోజ్ పూరి నటుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. నటుడిగానే కాదు ఎంపీగాను ఉన్నారు రవికిషన్. ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఎంపీ రవికిషన్ పేరు హాట్ టాపిక్ గా మారింది. రవికిషన్ కు ప్రీతి కిషన్ అనే భార్య ఉంది. అలాగే ఈ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటుంది ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ ముందురావడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా జరగనున్న ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నారు రవికిషన్. ఈ క్రమంలో ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ బయటకు వచ్చింది. అపర్ణా ఠాకుర్ అనే మహిళ మీడియా ముందుకు వచ్చి నేను రవికిషన్ భార్యను.. ఆయన నన్ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. మాకు ఓ పాప కూడా ఉంది అంటూ ఓ పాపను కూడా తీసుకువచ్చింది. 1996లోనే తమకు వెళ్లిందని ఇప్పటికీ ఆయన తమకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది ఆ మహిళ. అలాగే ఆ మహిళ తీసుకువచ్చిన పాప మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ళు వచ్చే వరకు నాకు రవికిషన్ నా తండ్రి అని తెలియలేదు.. అంతకు ముందు నేను ఆయన్ను అంకుల్ అనిపిలిచేదాన్ని . ఆయన కుటుంబాన్ని కూడా నేను కలిసాను. కానీ ఆయన తండ్రిగా నా దగ్గర ఎప్పుడూ లేరు. నన్ను కూతురిగా స్వీకరించాలి అంటూ చెప్పుకొచ్చింది ఆ యువతి.🗳️


bottom of page