top of page
MediaFx

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. సీఎం చంద్రబాబుతో కీలక భేటి


ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇక.. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం రెండు రోజులు అమరావతిలో పర్యటించింది. దానిలో భాగంగా.. సీఎం చంద్రబాబును కలిసిన బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఉన్నారు. అయితే.. మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన వరల్డ్‌ బ్యాంక్‌ బృందం.. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం అయింది. సీఆర్టీయే గురించి.. అమరావతి ప్రాజెక్ట్‌ ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి వివరించారు. ఆ తర్వాత.. అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణంలోనున్న భవనాలను పరిశీలించారు. అంతకుముందు.. ఆదివారం రోజున రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ను సందర్శించడంతోపాటు.. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌ను పరిశీలించారు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు. మొత్తంగా.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.

bottom of page