top of page
MediaFx

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..!


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ విలువ వేలు, లక్షలు కాదు కోట్లు. ఈ షూ స్పెషాలిటీ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ షూ పేరు మూన్ స్టార్ షూస్. దీనిని ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియో వియెట్రి తయారు చేశారు. మూన్ స్టార్ షూస్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు అంకితం చేయబడింది. ఈ అద్భుతమైన షూ 2019లో దుబాయ్‌లో జరిగిన MIDE (మేడ్ ఇన్ ఇటలీ, డిజైన్డ్ ఇన్ ఎమిరేట్స్) ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రదర్శించబడింది. ఈ షూ ధర 19.9 మిలియన్ డాలర్లు అంటే అప్పటి లెక్క ప్రకారం.. దాదాపు రూ. 164 కోట్లు అని తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. చాలా మంది మిలియనీర్ల సంపద కూడా ఈ షూ ధర అంత లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ షూ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మూన్ స్టార్ షూస్ మడమల భాగంలో బంగారంతో తయారు చేయబడ్డాయి. 30-క్యారెట్ వజ్రాలతో అలంకరించబడ్డాయి. దీనితో పాటు, ఈ షూలో అసాధారణమైన, అరుదైన విషయం మరొకటి ఉంది. ఈ షూ తయారీ కోసం అర్జెంటీనా ఉల్క ముక్కను కూడా ఉపయోగించారట. ఈ ఉల్క 1576 సంవత్సరానికి చెందినది. ఈ షూ అత్యంత విలువైనది. చారిత్రకమైనది కావడానికి ఇదే కారణం. మూన్ స్టార్ షూస్‌ని డిజైన్ చేసిన ఆంటోనియో వియెట్రీ ఇంతకు ముందు కూడా అలాంటి షూలను తయారు చేశారు. ఆంటోనియో వియెట్రి 2017లో ప్రపంచంలోనే మొట్టమొదటి 24k బంగారు షూని తయారు చేశాడు. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు.. అతను విలాసవంతమైన, ఖరీదైన ఫ్యాన్సీ వస్తువులను తయారు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.



bottom of page