కేజీఎఫ్ స్టార్ యష్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులోకూడా యష్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్లు మన దగ్గర బ్లాక్ బస్టర్ హిమోట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు యష్ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 3 గురించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో యష్ ప్రస్తుతం టాక్సిక్‌పై దృష్టి సారించాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఇందులో యష్ తో పాటు నయనతార కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ఎంపిక కూడా ఖరారైనట్లు సమాచారం. ఇప్పుడు హిందీ బెల్ట్ నుంచి మరో నటి ఈ సినిమాలోకి రానుందని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ నటి తారా సుతారియా కూడా యష్ చిత్రంలో కనిపిస్తుందని తెలుస్తోంది. ‘తడప్’ , ‘హీరోపంతి 2’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు. ఇప్పుడు యష్ సినిమాలో చేస్తుందని టాక్.. ‘టాక్సిక్’లో యష్‌కి మొదటి ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తుంది. తారా రెండో ప్రేయసిగా కనిపిస్తుందట. అలాగే యష్‌తో కలిసి పనిచేయడం ఆమెకు చాలా పెద్ద అవకాశం. గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి, ఇందులో స్త్రీ పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా చూపించనున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇందులో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉంటారని అంటున్నారు. ఈ చిత్రంలో కియారా, తారా సుతారియా కాకుండా, హుమా ఖురేషి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె పాత్ర నెగిటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకుముందు ‘మోనికా ఓ మై డార్లింగ్’లో గ్రే షేడ్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ ముగ్గురు బాలీవుడ్ భామలే కాకుండా నయనతార కూడా ఈ సినిమాలో నటిస్తుంది. టాక్సిక్‌లో ఆమె యష్‌కి సోదరిగా కనిపిస్తుందని అంటున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం కరీనా కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి నయన్ వచ్చింది. ఇక ఈ సినిమా కథ 50-70ల మధ్య కాలంలో సాగుతుంది. అప్పట్లో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు.ఈ మూవీ జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అనుకున్న సమయానికి సినిమా పూర్తయితే ఏప్రిల్ 10, 2025న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.