top of page

ఆ వైసీపీ నేత భవిష్యత్తు ఏంటి.. అరెస్ట్ తప్పదా..

MediaFx

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ నివాసంలో ఉండటంతో ఆ ఇంటి బయట పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు.

ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి తప్పించుకోకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు కదలనివ్వకుండా నిఘా పెట్టారు.

మరోవైపు, పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గురువారం వరకూ ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మోహరించారు. పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్‌ను ప్రకటించారు. వ్యాపార దుకాణాలను మూసివేయించారు.

ఇందువల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏక్షణమైనా అరెస్టు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలోకి రావడం కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఇబ్బందికరంగా మారింది. అరెస్టు తప్ప వేరే ఆప్షన్‌ కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో పిన్నెల్లి ఫ్యూచర్‌ ఏంటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


bottom of page