గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ చిత్రానికి 'దేవకీ నందన వాసుదేవ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని ఏమయ్యిందే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో అశోక్ సరసన వారణాసి మానస జోడిగా నటిస్తుంది. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1 ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.✨