top of page
MediaFx

పసుపు.. పద్నాలుగు రోజులు


పసుపు భారతీయుల వంటల్లోనే కాకుండా, వివాహాది వేడుకల్లోనూ ప్రాముఖ్యం కలిగిన దినుసు. అయితే, ఆర్థరైటిస్‌, టెండనైటిస్‌, బర్సయిటిస్‌ లాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల నివారణలో, కిడ్నీల పనితీరు మెరుగుపర్చడంలో, పాదాల వాపును తగ్గించడంలోనూ పసుపు ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పద్నాలుగు రోజులపాటు పసుపును ఆహారంలో, పాలు, మజ్జిగలో తగిన మోతాదులో భాగం చేసుకుంటే సానుకూల ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్‌, క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఉంటాయి. గాయాల చికిత్సలో, ఇన్ఫెక్షన్లను నియంత్రణలో ఇవెంతో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ విషయంలో కూడా పసుపు ప్రయోజనకారిగా ఉంటుందట. ఇంకా జీర్ణ వ్యవస్థలో రసాల ఊటను పెంచడం, కడుపులో మంట తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయులు ఆరోగ్యకరంగా ఉండటానికి, ఊబకాయం ముప్పు తగ్గడానికీ పసుపు సహకరిస్తుందట.

ఇందులో ఉండే కర్కుమిన్‌ శరీరంలో ఫంగస్‌, బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుందట. అయితే, మంచిది కదా అని పసుపును ఎక్కువగా తీసుకుంటే మాత్రం అలర్జీలు, డయేరియా లాంటి సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా పసుపులో కాల్షియం ఆగ్జలేట్‌ ఉంటుంది కాబట్టి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని పేర్కొంటున్నారు.

bottom of page