top of page
MediaFx

అవును నేను తప్పు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి జరగనివ్వను..


అవును నేను తప్పు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అలాంటి పొరపాటు జరగనివ్వను. అంటూ గట్టిగా నిర్ణయమే తీసుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత.

ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఈ బ్యూటీ, త్వరలో మళ్లీ కెరీర్‌ను రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్‌ ప్లాన్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సామ్.

గత ఏడాది ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత, ఆ తరువాత ఇంత వరకు కెమెరా ముందుకు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నా.. అఫీషియల్‌గా ఏ సినిమా పట్టాలెక్కలేదు.

దీంతో కొద్ది రోజులుగా ఆడియన్స్‌తో టచ్‌లో లేకుండా పోయారు ఈ బ్యూటీ. సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ తన ఫ్యూచర్‌ ప్లాన్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ మధ్య తన హెల్త్ ఇష్యూ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పుడ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.

తాను తినే విషయంలోనే కాదు తాను ప్రమోట్‌ చేసే ఫుడ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా అన్నారు సామ్‌.

ఆరోగ్యకరమైన ఫుడ్‌కి మాత్రమే బ్రాండింగ్ చేస్తానని చెప్పారు. తనలా మరొకరు బాధపడకూడదన్న ఉద్దేశంతో సమంత తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.

bottom of page