top of page
MediaFx

బంగ్లాదేశ్‏లో విధ్వంసం.. యంగ్ హీరోను కొట్టి చంపిన అల్లరిమూకలు..


బంగ్లాదేశ్ లో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు సలీం ఖాన్. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించారు. అలాగే అతడి కొడుకు షాంటో ఖాన్ ఇప్పుడిప్పుడే హీరోగా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా బంగ్లాలోని అల్లరి మూకలు ఆ తండ్రికొడుకులను దారుణంగా కొట్టి చంపేశాయి. మీడియా కథనాల ప్రకారం ఆగస్ట్ 5న సాయంత్రం చాంద్ పూర్ ప్రాంతం నుంచి తండ్రి కొడుకులు సలీం ఖాన్, షాంటో ఖాన్ లు పారిపోయారు. కానీ వీరిద్దరిని బలియా యూనియన్ లోని ఫరక్కాబాద్ మార్కెట్లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో పిస్టల్ పేల్చి ఇద్దరు తండ్రికొడుకులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడికి భారీగా జనాలు చేరుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన జనాలు ఆ తండ్రికొడుకులను తీవ్రంగా కొట్టగా.. అక్కడిక్కడే మరణించారు.

సలీం ఖాన్ నిర్మాతగా దాదాపు పది సినిమాలను నిర్మించారు. అలాగే అతడి కుమారుడు షాంటో ఖాన్ 2023లో బాబుజాన్ సినిమాతో హీరోగా నటించాడు. ఆంటోనగర్, తుంగిపరార్ మియా భాయ్ సినిమాల్లో నటించాడు.

bottom of page