top of page
Shiva YT

‘అసలైన ఎంటర్టైనర్ మూవీ అంటే ఇదే’..

గత కొన్నాళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న శ్రీవిష్ణుకు ఈ సినిమా హిట్ ఇచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీకి భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇందులో వెన్నెల కిశోర్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. జూన్ 29న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

యంగ్ హీరో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాడు. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో కామెడీ ఖచ్చితంగా ఉండాల్సిందే. తాజాగా సామజవరగమన సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‏గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. గత కొన్నాళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న శ్రీవిష్ణుకు ఈ సినిమా హిట్ ఇచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీకి భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇందులో వెన్నెల కిశోర్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. జూన్ 29న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.తాజాగా ఈసినిమాపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ మూవీ అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. “చాలా కాలం తర్వాత వచ్చిన అసలైన ఎంటర్టైనర్ మూవీగా సామజవరగమన ఉండిపోతుంది. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా హాయిగా నవ్వించింది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ మూవీని చాలా గొప్పగా తెరకెక్కించారు. శ్రీవిష్ణు.. నరేష్.. వెన్నెల కిశోర్.. రెబా మోనికా జాన్ నటన చాలా బాగుంది. ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు” అంటూ రాసుకొచ్చారు బన్నీ.ఇదిలా ఉంటే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

bottom of page