top of page
Suresh D

నెట్‌ కనెక్షన్ లేకపోయినా ఆన్‌లైన్‌లో పాటలు వినొచ్చు..🎧🌐

ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ ఫారంనకు యూట్యూబ్‌ ప్రసిద్ధి. వీడియో స్ట్రీమింగ్‌లో మరే ఇతర వేదిక యూట్యూబ్‌నకు పోటీ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అయితే కేవలం వీడియోలు మాత్రమే కాక.. ఇటీవల మ్యూజిక్‌ పై కూడా యూట్యూబ్‌ ఫోకస్‌ పెట్టింది.

ఈ క్రమంలో తన యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫారంలో కొన్ని మార్పులు చేయడంతో పాటు వినియోగదారులకు అవసరమైన కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫారంను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ఫీచర్‌. మీకు ఇంటర్‌నెట్‌ కనెక‌్షన్‌ లేకపోయినా మీకిష్టమైన పాటలను వినే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే యూబ్యూట్‌ మ్యూజిక్‌ మొబైల్‌ యాప్‌( ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌)లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి కూడా అందుబాటులోకి తెచ్చింది.యూట్యూబ్ ఈ ఫీచర్‌ని మొదటిగా డెస్క్‌టాప్‌లలో కొంతమంది వినియోగదారులతో పరీక్షించింది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు విస్తృత లభ్యతను పొందినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యూట్యూబ్ మ్యూజిక్ వినియోగదారులందరికీ ఆఫ్‌లైన్ లిజనింగ్ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.🌐

bottom of page